చోరీ కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులు: సీపీ స్టీఫెన్ రవీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు.
కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1 వ తేదీ రాత్రి బీహార్‌కు చెందిన తన స్నేహితులు మహ్మద్ షాబాజ్, ఇంతియాజ్, నయీమ్, సదాకత్తో కలిసి అల్మార తాళాన్ని పగుల గొట్టి రూ. 50 లక్షల 30 వేలు చోరీ చేసి పరారయ్యారు. పోలీసులు మసూద్‌ను విచారించగా దొంగతనం చేసిన తీరును వివరించాడు. మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బీహార్ వెళ్లి మసూద్, షాబాజ్ను చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగతా ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ స్టీఫెన్ రవీంద్రా తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!