జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ నుంచి 11, ఎంఐఎం నుంచి 7 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య 9-6 చొప్పున ఒప్పందం జరిగింది. 15 స్థానాలను ఏకగ్రీవం దిశగా టీఆర్ఎస్-ఎంఐఎం ప్రయత్నాలు చేస్తుంది. స్కూటీ ని తర్వాత పలువురు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. రేపు స్కూటీ ని చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 15వ తేది వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. 15 స్థానాలకు టిఆర్ఎస్ ఎంఐఎం ఒప్పందం ప్రకారం ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉంది. 15 మందికి మించి పోటీలో ఉంటే ఎన్నిక అనివార్యం. అయితే ఈ నెల 20వ తేదీన ఎన్నిక జరగనుండగా… అదే రోజు ఫలితాలు రానున్నాయి.