తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు.. వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు సీఎం కేసీఆర్.. ఇక, ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీష్ రావును వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెకర్ డా. రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్, కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీ.ఎస్.ఎం.ఐ.డి.సి. ఎండి చంద్ర శేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు అధికారులు.