ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. దాంతో కొనుగోలు దారులు గోల్డ్ కొనాలంటేనే భయపడిపోయారు. అయితే గోల్డ్ రేట్లు మూడు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.250 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (జూన్ 25) 24 క్యారెట్ల…
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు…
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు భారీ స్థాయిలో దిగొచ్చింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. ఈరోజు రూ.750 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై వరుసగా రూ.60, రూ.820 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,550గా.. 24…
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. తాజగా నార్సింగ్ లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. రూ. 30 లక్షల విలువైన ఎస్టసీ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక నైజీరియన్ తో పాటు.. ఇద్దరు లోకల్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. మణికొండ లో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా…
గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇటీవల లకారంకు చేరుకున్నాయి. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. శనివారం పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.60 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10…
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్…
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
Yoga Celebrations: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోకిలాలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద పాల్గొని.. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
GHMC : హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని…