నేటి రోజుల్లో విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లక్షల రూపాయల ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తల్లిదండ్రులు కాయాకష్టం చేస్తూ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూనే.. లేట్ ఫీజుల పేరిట దోపిడికి పాల్పడుతున్నారు. రెండు రోజులు ఫీజు కట్టడం లేట్ అయ్యిందని రూ. 3 వేలు పెనాల్టీ వసూలు చేసింది అవినాష్ కళాశాల. దీంతో విసిగిపోయిన ఆ విద్యార్థి తండ్రి మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు.
Also Read:July Movies : జూన్.. బాక్సాఫీస్ వెలవెల.. జులై సినిమాలు థియేటర్స్ ను కాపాడతాయ?
ఓవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు మరోవైపు లేట్ ఫీజు అంటూ తల్లిదండ్రులను నుండి పెద్ద మొత్తంలో డబ్బులు లాగుతున్నారు కళాశాల యజమాన్యం. తాజాగా హైదరాబాద్ కోటి వెళ్లే దారి, బడి చౌడి లోని అవినాష్ కళాశాలలో రెండు రోజులు ఆలస్యమైందని పెనాల్టీగా 3000 అధికంగా ఫీజు వసూలు చేశారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఓవైపు లక్షల్లో ఫీజులు కడుతున్నా రెండు రోజులు ఆలస్యం పేరిట ఈ అధిక ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీరి అక్రమాలను విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.