Gold Price Today in Hyderabad on 2nd July 2025: ఆషాఢ మాసం సీజన్, శ్రావణ మాసం పెళ్లిల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. జూన్ నెలాఖారన వరుసగా 7-8 రోజులుగా తగ్గిన పసిడి ధర మరలా పెరుగుతోంది. జులై మొదటి రోజున బంగారం ధర భారీగా పెరగగా.. ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరిగింది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1050 పెరగగా.. ఈరోజు రూ.450 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.1140 పెరగగా.. ఈరోజు రూ.490 పెరిగింది.
బులియన్ మార్కెట్‌లో బుధవారం (జులై 2) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.90,650గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,890గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,650గా.. 24 క్యారెట్ల ధర రూ.98,890గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.90,800గా.. 24 క్యారెట్ల ధర రూ.99,040గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Also Read: Sigachi Blast: సిగాచి పరిశ్రమ పేలుడు.. గందరగోళానికి గురి చేస్తున్న అధికారుల లెక్కలు!
మరోవైపు వెండి ధర కాస్త ఊరటనిస్తోంది. నిన్న భారీగా పెరిగిన వెండి ఈరోజు స్థిరంగా ఉంది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,10,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,20,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,10,000గా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.