Lakshmi Narasimha Swamy Temple మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు, మనసు ప్రశాంతతను కోల్పోయినప్పుడు… చాలామంది భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు. ఆ దైవ దర్శనం, ఆశీస్సులు మనకు ఎంతో ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తాయి. హైదరాబాద్ మహానగరంలో, కోఠిలో వెలసిన ఒక ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక్క దర్శనంతోనే భక్తుల సమస్యలన్నీ దూరం అవుతాయని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఆ శక్తివంతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశేషాలు ఏంటో ఇప్పుడు…
Bars Draw : తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148…
Telangana Rains : తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…
Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు.
Hyd Metro: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టొ్ద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Rains : తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గురువారం నాటి వాతావరణ సూచనల ప్రకారం, కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారశైలి కొద్ది కాలంగా... తెలంగాణ బీజేపీకి మింగుడుపడనట్టుగానే ఉంటోంది. పార్టీ నేతల మీద తిట్ల దండకాలు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద మిమర్శల్లాంటివి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. అయితే.... ఆయన డైరెక్ట్గా విమర్శిస్తున్నా, సోషల్ మీడియా మెసేజ్లు పెడుతున్నా... కమలం నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవరైనా అడిగితే కూడా....అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ దాటేస్తున్నారు. అదే సమయంలో అటు రాజాసింగ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు.
హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్లో తాజాగా పాముల సంచారం కలకలం సంచలనంగా మారింది. రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద పాములు కనిపించడంతో థియేటర్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఈ ఘటన సినీ ప్రేక్షకులలోనూ భయాందోళనలను రేకెత్తిస్తోందని చెప్పాలి. సంధ్య థియేటర్, హైదరాబాద్లో సినిమా ప్రేమికులకు ఒక హాట్ స్పాట్. అయితే, ఇటీవలి కాలంలో థియేటర్లో పాములు తరచూ కనిపిస్తున్నాయని సిబ్బంది తెలిపారు. Also Read:Divi: నేనే తప్పూ చేయలేదు.. దయచేసి…