Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి సమాచారం చేరింది.
Kothwalguda Eco Park: కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది.
Hyderabad: సికింద్రాబాద్ లోని మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
New Traffic Rules: హైదరాబాద్ నగరంలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి.. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఒక వైపు వాహనాల వేగం పెరిగింది.. 24 నుంచి 26 కిలోమీటర్లు వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయని తెలిపారు.
Bomb Threat: హైదరాబాద్ సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు ఇవాళ (జూన్ 19న) బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు స్కూల్ యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. హూటాహూటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ స్కూల్‌కు చేరుకుని క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది.
డ్రంకన్ డ్రైవ్ లో స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుబడిన ఘటనపై స్పందించిన హైదరాబాద్ సీవీ ఆనంద్.. బ్రీత్ ఎనలైజర్ పరికరాలను స్కూల్ మేనేజ్మెంట్లు దగ్గర ఉంచుకోవాలి అన్నారు. బస్సు డ్రైవర్ల పరిస్థితిని బట్టి అవసరమైతే వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలన్నారు.
Cyber Fraud : 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అనగానే.. జీవితంలో చాలా అనుభవాలున్న పెద్దమనిషి అనిపించాలి కదా.. కానీ డిజిటల్ మోసాలకి వయస్సు అడ్డుకాదన్నట్టు, ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో అతని విశ్రాంత జీవితం తలకిందులైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రిటైర్డ్ ఉద్యోగికి ఓ యువతి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను పేద కుటుంబానికి చెందినవని చెప్పి వైఫై కనెక్షన్ కోసం రూ.10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన బాధితుడు డబ్బులు పంపించడంతో…