Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్యెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు.
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు. యాంకర్ స్వేచ్ఛకు 2014లో భర్త క్రాంతి కిరణ్‌తో విడాకులు అయ్యాయి. ఆపై కొన్ని రోజుల…
PJR Flyover: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు.
Hyderabad: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు.
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు…
Indira Canteen : హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి తర్వాత వచ్చిన బీఆర్ఎస్…
హైదరాబాద్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రి పూట అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలడం లేదు. అలాగే ప్రకాష్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి తన రూమ్‌కు తీసుకు వెళ్లాడు. తర్వాత అఘాయిత్యం చేశాడు. పైగా వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అర్ధరాత్రులు ఇంటి నుంచి బయటకు రావడం.. ఏదైనా అకృత్యాలు జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కామన్ అవుతోంది. ఎన్నో కేసులు…
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పడు కొత్త కొత్త ట్విస్ట్‌లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సిట్ కూడా కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతేహై... అన్నట్టుగా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూనే ఉంది. కానీ... తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం సిట్ బృందానికి కూడా ఎక్కడో డౌట్ ఉందా అన్న అనుమానాల్ని పెంచుతున్నాయట.
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
DCP Suresh:హైదరాబాద్ జీడిమెట్లలో కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించిన కూతురి సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూతురు తన ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా బాలానగర్ డీసీపీ సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. Read Also:Shubhanshu Shukla: కుమారుడు రోదసిలోకి వెళ్తుండగా…