పుట్టిన రోజు ప్రతి ఒక్కరికి మధురమైన రోజు. స్పెషల్ డే రోజు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు, కేక్ కటింగ్స్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, పార్టీలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇటీవల బర్త్ డే సెలబ్రేషన్స్ హద్దులు మీరుతున్నాయి. నడిరోడ్లపై కేక్ కట్ చేస్తూ యువకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు రెక్కీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో యువకులు రోడ్డుపై…
హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి, అప్పుడే పుట్టిన బాబు మృతి చెందారు. స్టాఫ్ నర్స్ గర్భిణీ స్ర్తీకి డెలివరి చేసింది. ఆయమ్మ సహాయంతో.. ఇద్దరూ కలిసి డెలివరి చేయడంతో తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా మరి మృత్యువాత పడ్డారు..
హైదరాబాద్ సూరారంలో యువకుడి మర్డర్‌ను కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు స్నేహితులేనని పోలీసులు తెలిపారు
హైదరాబాద్ ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంచు విష్ణు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ హార్డ్ డిస్క్‌లో సినిమాకు సంబంధించిన కీలకమైన వీఎఫ్ఎక్స్ డేటా, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, దీని మాయం వెనుక తన తమ్ముడు మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో, మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ సినిమా సక్సెస్ ఈవెంట్లో ఈ విషయంపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిజం పబ్‌లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి కల్పిక, తన స్నేహితులతో కలిసి ఒక బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిజం పబ్‌కు వెళ్లినట్లు సమాచారం.…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.