ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కానీ మేము అడిగితే మాత్రం ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేద్దాం అన్నా, అనుమతి ఇవ్వని…
హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్‌కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also:…
కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ సర్వీసెస్, విద్యుత్, రోడ్ల భవనాల శాఖల నుంచి…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి.. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.. అయితే, ఆ అల్పపీడన ప్రభుత్వంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన…
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్‌షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. Read Also: పబ్జీ గేమ్…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే…
పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగింది.. ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం ధర.. కాస్త ఊరట కలిగిస్తూ మళ్లీ దిగివచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ పైకి కదులుతూ 50 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి.. దీంతో.. హైదరాబాద్‌లో చాలా నెలల తర్వాత రూ.50 వేలస్థాయిని దాటినట్టు అయ్యింది.. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.760 పెరిగి, 50,070కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల…
డ్రగ్స్ రవాణాకు ట్రాన్సిట్ హబ్ గా మారింది హైదరాబాద్. ఇక్కడ నుంచి నుంచి వందల కిలోల డ్రగ్స్ ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుంది డ్రగ్స్ మాఫియా. ఏడాది కాలంలోనే 315 కిలోల పై చిలుకు డ్రగ్స్ ను పంపింది మాఫియా. డ్రగ్స్ కు హైదరాబాద్‌లో ట్రాన్సిట్ పాయింట్ గా ఎంచుకుంది మాఫియా. హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషన్ పార్సిల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తుంది. అయితే వివిధ రూపాల్లో డ్రగ్స్ ని ఆస్ట్రేలియా…
జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ నుంచి 11, ఎంఐఎం నుంచి 7 నామినేషన్లు దాఖలు చేసారు. టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య 9-6 చొప్పున ఒప్పందం జరిగింది. 15 స్థానాలను ఏకగ్రీవం దిశగా టీఆర్ఎస్-ఎంఐఎం ప్రయత్నాలు చేస్తుంది. స్కూటీ ని తర్వాత పలువురు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. రేపు స్కూటీ ని చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 15వ తేది వరకు నామినేషన్ ఉపసంహరణకు…
ధాన్యం సేకరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది.. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గరకు కూడా ధర్నా తలపెట్టారు.. దీని కోసం అనుమతి కోరుతూ పోలీసులకు పర్మిషన్ అప్లై చేవారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.. దానిని పరిశీలించిన సెంట్రల్ జోన్ పోలీసులు.. కొన్ని షరతులత కూడిన అనుమతి మంజూరు…