హరీష్‌రావు కీలక ఆదేశాలు.. ఆరోగ్య సూచిల్లో అగ్రస్థానంలో ఉంచాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్‌రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్‌రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించిన ఆయన.. ప్రతి నెల విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తాన్నారు.. పనితీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని స్పష్టం చేసిన మంత్రి.. అదే పదోన్నతులు, ప్రోత్సాహకాలకు గీటురాయిగా పేర్కొన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి, రిపోర్టులు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు హరీష్‌రావు.
Read Also: కొత్త వేరియంట్ భయం… అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
Also Read
మలేరియా, డెంగ్యూ వంటి వెక్టర్ బోర్న్ రోగాల విషయంలో సంబంధిత జిల్లాలను అప్రమత్తం చేయాలి.. తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు మంత్రి హరీష్‌రావు.. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నదని, అదే స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో శ్రద్ద చూపించాలన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉండాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలి.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. డిసెంబర్ నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్య్రక్రమాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!