న్యూ ట్రెండ్… సైకిల్‌పై పెళ్లి మండపానికి వెళ్లిన హైదరాబాదీ వరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు.
Read Also: ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే… వెయ్యి కిమీ ప్రయాణం చేయవచ్చు
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
సాధారణంగా వివాహ వేదికకు వరుడు, వధువు కార్లలో వెళ్తుంటారు. వెరైటీగా వెళ్లాలనిపిస్తే కొందరు గుర్రపు బండ్లను అద్దెకు తీసుకుని కూడా వెళ్తారు. అయితే దినేష్ మాత్రం అలా ఆలోచించలేదు. కాలుష్యానికి కారణమయ్యే మోటార్ వాహనాల బదులు ఏకో ఫ్రెండ్లీగా ఉండే సైకిల్‌పై పెళ్లి వేదిక వద్దకు వెళ్లాలని భావించాడు. అంతేకాకుండా సైకిల్ తొక్కితే మంచి ఆరోగ్యంగానూ ఉండొచ్చని సమాజానికి ఓ సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దినేష్ స్టైలుగా సైకిల్ తొక్కుతూ వివాహ వేదికకు వెళ్లడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ… తన సైక్లింగ్ కమ్యూనిటీ స్నేహితులు సైకిళ్లపై ఊరేగింపు నిర్వహించారని… ఇలా చేయడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. మరోవైపు నూతన జంటకు సైక్లింగ్ కమ్యూనిటీ స్నేహితులందరూ కలిసి స్టైలుగా ఉండే సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివాహం కాగానే వధువును కూడా సైకిల్‌పైనే ఇంటికి తీసుకువెళ్లాలని వారు కోరడం విశేషం.

తాజావార్తలు
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!