కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఉపాది రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. జనజీవనం సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో రద్దీ పెరిగింది. ఇప్పటికే సిటీ బస్ సర్వీసులను అందుబాటులో ఉంచిన ఆర్టీసీ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెల్లవారు జాము 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా, ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ…
చలికాలం ప్రారంభం కావడంతో పొగమంచు హైదరాబాద్ నగరాన్ని కప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్-హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా…
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 45,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా..…
నిన్న కేటీఆర్, మెట్రో ప్యాసింజర్ల కు ఇచ్చిన హామీ ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన హెచ్ఎంఆర్… ప్యాసింజర్ల అభ్యర్థనతో మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మెట్రో రైలు సమయం పొడిగించింది. రేపటి నుండి ఉదయం అరుగంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక రాత్రి చివరి రైళ్లు 10.15 కు స్టేషన్ల నుంచి కదులుతాయి. ఉదయం 6 గంటల నుంచి చివరి స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న మొదటి మెట్రో.. రాత్రి 10.15 గంటలకు…
హైదరాబాద్ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఉందని కేసీఆర్ గుర్తించుకోవాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లంకను కూల్చుతాం.. రామ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముం దుందని తరుణ్ చుగ్ అన్నారు. ఆలీబాబా 40 దొంగల మాదిరి కేసీ ఆర్ క్యాబినేట్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని తరుణ్ చుగ్ ఆరోపిం చారు.…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి…
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఆగిపోతుందనుకుంటే.. వాటి తీవ్రత మరింత పెరిగింది.. సీఎం కేసీఆర్ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇలా.. అన్ని విషయాలను తూర్పారబడుతున్నారు సీఎం కేసీఆర్.. అయితే, బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర…
పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా…
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 49 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.…