ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు…
చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. హోండా యాక్టివాపై 117 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.3 లక్షలకు పైగా ఉన్నది. Read: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్…
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే.. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత…
ఆన్ లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ చాటింగ్ వరకు వచ్చింది. అమ్మాయి హస్కీ వాయిస్ కి ఫిదా అయిపోయాడు ఆ యువకుడు.. ఇంకేముంది గంటల తరబడి ఫోన్ లో కబుర్లు.. ఒకరోజు రాత్రి వీడియో కాల్ చేసింది.. యువకుడు గాల్లో తేలిపోయాడు. అమ్మాయి ఫేస్ చూపించకుండానే తన బట్టలు విప్పమని అడిగింది. అమ్మాయి అడిగితే కాదంటానా..? అని ఐదు నిమిషాల్లో నగ్నంగా మారిపోయాడు. మరో ఐదు నిమిషాల్లో ఫోన్…
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 45,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి..…
కరోనా కాలంలో పెరిగిన బంగారం ధరలు ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని అనుకునే లోగా క్రమంగా పెరగడం మొదలుపెట్టాయి. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నది. ఇప్పటికే యాభైవేలు దాటిపోయింది. ఇక సోమవారం రోజున కూడా ఈ ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి. Read: మెట్టుదిగిన తాలిబన్: ఏ దేశంతోనూ మాకు… 10 గ్రాముల 22…
బంజారాహిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో ఉదయం, సాయంత్రం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ లో కేవలం వాకింగ్ చేయడం మాత్రమే కాదు నేరాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి పై దాడి జరిగింది. చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.…