మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్.. హైదరాబాద్‌కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు.
Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం
Also Read
తొలుత ఈనెల 15న గవర్నర్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండగా… వైద్యులు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈనెల 17న ఆయన్ను అత్యవసరంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్స అనంతరం కోలుకోవడంతో ఈనెల 23న డిశ్చార్జ్ అయ్యి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో గవర్నర్ మళ్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. కాగా గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!