డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్ డీమార్ట్ లోకి వెళ్లి యాలకుల ప్యాకెట్లను దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!
సనత్ నగర్ డీమార్ట్ లో దొంగతనానికి పాల్పడ్డాడు ఓ కస్టమర్. 100 గ్రాముల ఇలాచీ ప్యాకెట్లు దొంగిలించి లోదుస్తుల్లో దాచుకున్నాడు. స్టాక్ లో తేడా రావడంతో డీమార్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఓ కస్టమర్ ఇలాచీ ప్యాకెట్లను దొంగిలించినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీమార్ట్ స్టోర్ యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇది తెలిసిన వారు ఎంతకు తెగించావయ్య.. ఇలాచి దొంగ వెరీ స్పైసీ అంటూ కామెంట్ చేస్తున్నారు.