CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూన్నాళ్ళ ముచ్చటే అన్నారు.. మూడు నెలల తర్వాత.. కలిసి పని చేయలేరు అన్నారు.. ఆ తర్వాత పథకాలు అమలు ఎక్కడ చేస్తారని విమర్శలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… తెలంగాణ రోల్ మోడల్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం.. రైతాంగానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మనది.. గోతి కాడ నక్కలా చూశారు కొందరు.. రైతు భరోసా వేయరు అనుకున్నారు.. కానీ, 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.. రైతు రాజ్యం ఎవరు తెచ్చారని చర్చ పెడదాం.. ఢిల్లీలో మోడీ వస్తాడా.. గల్లీలో కేడీ వస్తాడా చూద్దాం.. నేను మా కార్యకర్తలతో వస్తాను అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
అయితే, పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బట్టలూడదీసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లకు ఇచ్చే సరుకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు.. కానీ, మనం అధికారంలోకి వచ్చాకా మహిళా సంఘాలకు సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ఇచ్చామని తెలిపారు. ఒక్కో అడుడు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.