ఎయిర్టెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ మారథాన్ పదో ఎడిషన్ను ఆదివారం నాడు సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్ కొనసాగుతోంది. ఈ మారథాన్లో ఆరువేల మంది పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10కే మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ కూడా సందడి చేసింది. Read Also: వరంగల్ బాలుడికి…
సైబర్ చీటర్ నైజీరియన్ ను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పేర్లతో పరిచయం, ఆపై ప్రేమ , పెళ్లి అని ఓ యువతిని నమ్మించిన నైజీరియన్… తను యూకే లో డాక్టర్ అని చెప్పాడు. యూకే నుండి 40 వేల ఫౌండ్ల నగదు పార్సిల్ పంపిస్తున్నానని చెప్పిన చీటర్… ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేసాడు. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్సల్, ఐటి, మనీలాండరింగ్…
నగరంలో సందడి నెలకొంది. బుక్ ఫెయిర్ మళ్లీ ప్రారంభం కావడంతో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం హోరెత్తింది. ట్రాలీలు పుస్తకాల డెక్లను డెలివరీ చేయడం స్టాల్ నిర్వాహకులు వాటిని పూర్తి ఉత్సాహంతో ఏర్పాటు చేయడంతో, ఈసారి 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పుస్తక ఎంపికల సాగరానికి ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమైంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 28 వరకు జరుగుతుంది. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఢిల్లీ, ముంబై…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. మంగళవారం దీక్షలు, పాదయాత్ర, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలతో.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆమె… ఇక, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర వాయిదా పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్న ఆమె.. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్తున్నారు.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. అందులో భాగంగా ఇవాళ రైతు…
తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనందించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించాలని గతంలోనే ప్రతిపాదించింది. కాగా ఇప్పటికే మొదటి విడతలో చాలా మంది రూ.10వేలకు పైగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో రూ.10వేల రుణం చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20వేల వరకు పంపిణీ చేయాలని ఇప్పించాలని నిర్ణయించింది. Read Also:కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం…
బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీగా పెరిగింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. అందుకే నిన్న బంగారం వెండి ధరలు పెరిగాయి. అయితే నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెలకొంది. దీంతో నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి.…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డును ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి వచ్చే ఏడాది ఏప్రిల్లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయొచ్చని స్పష్టం చేశారు. ఫలితాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ తెలిపారు. అనుమానం ఉంటే…
అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం…
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుండి తొలి గౌరవం వందనాన్ని స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. శిక్షణ పూర్తి చేసుకున్న 208 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లు,103 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు, నేవీ 2, కోస్ట్ గార్డ్ ఇద్దరిని ఆయన అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకొని…