హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్డీపీ కింద…
సాహిత్య రంగంలో డాక్టర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ చెన్నయ్యలు తల్లి పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని బొగ్గులకుంటలో, తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో శాంతా వసంతా ట్రస్టు పురస్కారాల ప్రధానోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రితో పాటు శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డి.. పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు. శాంతా వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో……
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్మీట్లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్…
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్బి-పాస్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పైన మంత్రి కె. తారకరామారావు సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతినిపురోగతిపై మంత్రి కె. తారకరామారావు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా…
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్‌ఆర్‌లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ…
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె..…
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు…
హైదరాబాద్ లో పబ్ కల్చర్ దారి తప్పింది. పబ్ కల్చర్ కు అలవాటు పట్టి దారి తప్పుతున్నారు యూత్. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్లపై తాగి తందనాలు ఆడుతున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్న అవేమీ పబ్ లు యాజమాన్యాలు, యువత పట్టించుకోవడం లేదు. నోటికి మాస్క్ లు లేవు… సోషల్ డిస్టెన్స్ లేదు.. గుంపులు గుంపులుగా రోడ్లపై యువత ఉంటున్నారు.…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా.. బంగారం ధరలు పెరుగుతుండటంతో… పుత్తడిని కొనుగోలు చేయాలంటే… ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,350 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నటి…