టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో…
ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్’ పేరుతో…
తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది… ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోన్న ఆర్టీసీ.. ఇప్పుడు న్యూఇయర్ కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా.. అంటే 2022 జనవరి 1వ తేదీన.. తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది ఆర్టీసీ.. Read Also: మొరాయించిన రవాణాశాఖ సర్వర్.. ట్యాక్స్‌పై క్లారిటీ…
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనత అందుకుంది… జంట నగరాల్లో పెద్దాస్పత్రిగా ఉన్న గాంధీలో.. అనేక అత్యుధునికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.. ఇక, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి కూడా మొదట ప్రభుత్వం గాంధీలోనే వైద్య సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్(డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్’ (ఐఎన్‌టీఈఎన్‌టీ-ఇంటెంట్)కు గాంధీ ఆస్పత్రిని ఎంపిక చేశారు.. ఇంకో విషయం ఏంటంటే.. దక్షిణ భారత…
న్యూ ఇయర్ వేడుకల సమయంలో గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ.. కొత్త సంవత్సర వేడుకలకు అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడపనున్నారు.. అయితే, ఒక్కరికి 100 రూపాయల చార్జ్ చేయనున్నట్టు వెల్లడించారు.. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.. Read Also: ఏపీ:…
న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. మందు వేద్దాం.. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం.. రచ్చ చేస్తామంటే కుదరదు.. ఎందకంటే.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు తెలంగాణ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించనున్నారు.. తాగి వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు.. ఇక, రెండో సారి పట్టుబడితే పదిహేను వేల ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు…
తాగి వాహనం నడిపితే పబ్‌లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్‌లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్‌ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు…
2021 మరికొద్దిగంటల్లో కనుమరుగు కానుంది. అయితే యువత మాత్రం 2021ని సాగనంపుతూ.. 2022కి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ ఏమున్నా జాన్తా నై అంటూ వేడుకలకు రెడీ అయిపోతున్నారు. ఆంక్షల బందీఖానా నుంచి వారు బయటపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ఏటా డ్రగ్స్ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి విక్రయాలు జరుగుతాయని పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా…
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంతో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తరుచుగా వాహనాల పార్కింగ్ లేకవపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో బల్కంపేట ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయానికి…