తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి.. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. మరోవైపు నిన్నటి(డిసెంబర్ 4వ తేదీ 2022)తో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. నేటి నుంచి కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం కానుందని.. నేటి నుంచి ఆరు సంవత్సరాల పాటు కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది..
Read Also: ఆ బ్యాంకులు సేఫ్..! ఆర్బీఐ కీలక ప్రకటన
ఇక, తెలంగాణలోని తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు శాసన మండలి సభ్యులు ఎన్నికైనట్లు ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.. మొత్తంగా 12 మంది ఎమ్మెల్సీలు.. శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు.. కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లు, వివరాలను గమనిస్తే.. 1. దండే విఠల్ (ఆదిలాబాద్), 2. తాత మధు (ఖమ్మం), 3. యాదవ రెడ్డి(మెదక్), 4. ఎల్. రమణ (కరీంనగర్), 5. ఎంసీ కోటి రెడ్డి (నల్గొండ)లు తొలిసారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.. మరోవైపు రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీల పేర్లను పరిశీలిస్తే.. 1. కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), 2. కుచ్చుకుళ్ల దామోదర్ రెడ్డి, 3. కసిరెడ్డి నారాయణ రెడ్డి (మహబూబ్ నగర్), 4. భాను ప్రసాద్ రావు (కరీంనగర్), 5. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 6. సుకంరి రాజు, 7. పట్నం మహేందర్ రెడ్డి (రంగారెడ్డి జిల్లా).