రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్‌రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్‌లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు.
Read Also: పెరుగుతున్న పాజిటివిటీ రేటు… లాక్‌డౌన్ తప్పదా?
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తనకు గూగుల్ పేలో ఓ రూపాయి పంపమని అడిగాడు. దీంతో చంద్రమోహనేశ్వర్‌రెడ్డి తన గూగుల్ పే నుంచి ఒక రూపాయి పంపించాడు. దీంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి వెంటనే రూ.99 వేలు నగదు డెబిట్ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రమోహనేశ్వర్‌రెడ్డి వెంటనే పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..