తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రస్థాయిలో పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీయనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 20 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు. Read Also: ఇంటర్ విద్యార్థి సంచలన ట్వీట్.. నా సూసైడ్‌కు కారణం…
‘పుష్ప’ సినిమాపై రోజురోజుకు అంచనాలు ఎక్కైవైపోతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా అని అభిమానులు కాచుకు కూర్చున్నారు. అందులోను ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ ని బన్నీ ఆకాశానికెత్తేశాడు.. సుకుమార్ దగ్గరకి వచ్చి ప్రతి దర్శకుడు నేర్చుకోవాలని చెప్పడంతో ఈ సినిమాపై ఇంకా అంచనాలు రెట్టింపవుతున్నాయి. సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతూ” సుకుమార్ గురించి ఒక ప్రేక్షకుడిగా మారి చెప్తున్నాను.. ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చెప్పొచ్చా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా ఎలా మారిందో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ” నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే…
పుష్ప.. పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సుకుమార్- అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొన్నారు అభిమానులు.. ఇక రేపే విడుదల కావడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్.. గత మూడు రోజులుగా అన్ని భాషలను కవర్ చేసుకొంటూ వచ్చిన బన్నీ ఇక చివరగా తెలుగు మీడియా ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. తాజాగా హైదరాబాద్ లో…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ…
ఎంత జాగ్రత్తగా ఉన్న రోజుకో పద్ధతితో మోసాలకు పాల్పడే వారు అదే పనిగా తమ చేతి వాటం చూపిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సీటీలో నకిలీ సెంకడ్ ఛానల్ బ్యాంకు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతోఈ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెకెండ్ ఛానల్ ముసుగులో పలువురు వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుని, బాధితులకు మంచి ట్రేడ్ ప్రాఫిట్…
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రాంగూడలో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా.. సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేశారు.. కిలో 44 గ్రాముల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును దోచేశారు.. ఇక, నకిలీ సీబీఐ అధికారులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని.. ఇంటి యజమాని సుబ్రహ్మణ్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంవత్సరం క్రితం కలిసి పని చేసిన వ్యక్తులే దొంగతనానికి…
బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. 265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి…
తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసులపై స్పందించారు. ఒమిక్రాన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నగర పోలీస్ కమిషనర్. ఇతర దేశాల నుండి వచ్చేవారు టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే బయటకి రావాలన్నారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గచ్చిబౌలి లోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నారు. బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు, వారితో కాంటాక్ట్ అయిన…