ఓ వర్గం మహిళలను టార్గెట్ చేస్తూ.. బుల్లి బై పేరుతో ఉన్న ఓ యాప్ విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఈ యాప్ ఆగడాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు.. ఇక, ముంబైలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళలు సింగిల్‌గా ఉన్న ఫొటోలను తీసుకుని.. వాటిని ఈ యాప్‌లో అమ్మకానికి పెట్టడం.. వాటిని వేలం వేయడమే బుల్లి బై యాప్ చేసే పని.. అయితే, ఇప్పుడు బుల్లి బై ఆగడాలు హైదరాబాద్‌ను కూడా తాకాయి.. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ..
Read Also: దారుణం.. నలుగురిని బలితీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్..
ముస్లిం మహిళలను కించ పరుస్తూ పోస్టులు పెడుతూ.. ట్విట్టర్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం, మంత్రి కేటీఆర్, డీజీపీలను కోరారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు.. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.. సమాచారం సేకరించి బుల్లి బై యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని.. వందలాది ముస్లిం యువతుల ఫొటోల్ని బుల్లి బైలో అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు.. హైదరాబాద్ కు చెందిన ముస్లిం యువతి ఫొటోలను పబ్లిష్ చేసిన బుల్లి బై యాప్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.. కాగా, ఇప్పటికే ఢిల్లీ, ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద ఫిర్యాదులు అందాయి.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి కూడా బుల్లి బైపై దృష్టి సారించారు.. ఇక, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా బుల్లి బైపై కేసు నమోదు చేసి.. టెక్నాలజీ సహాయంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.