ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నూతన విద్య ప్రణాళిక పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నూతన విద్యాప్రణాళికపై చర్చించనున్నట్టు సునీల్ అంబేకర్ తెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుంచి 7 వరకు, 2022 భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొంటున్నారు.ఈ సమావేశాలలో మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంఘం ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా చర్చించనున్నట్టు తెలిపారు. గతేడాది సమావేశంలో ఉపాధి కల్పనపై చర్చించామన్నారు. కోవిడ్ సమయంలో సేవ భారతితో సహా వివిధ సంస్థలు చేసిన సేవా కార్యక్రమాలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. విద్య రంగంలో జరుగుతున్న కార్యక్రమాలు వాటి పై చర్చిండంతో పాటు, ఏబీవీపీ, శిక్షణమండలి వారు చేపట్టిన కార్యక్రమాలను చర్చిస్తామన్నారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. వర్తమాన పరిస్థితులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్న విషయాలను సంస్థలకు చెందిన ప్రతినిధులు వివరిస్తారన్నారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సామరస్యత వంటి అంశాల్లో సమన్వయంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా చర్చ జరగనుందన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అందరూ 2 డోసులు టీకా తీసుకున్నారని అంబేకర్ వెల్లడించారు.
Also Read
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
తాజావార్తలు
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?