గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇటీవల లకారంకు చేరుకున్నాయి. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. శనివారం పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.50 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.60 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10…
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్…
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
Yoga Celebrations: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోకిలాలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద పాల్గొని.. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
GHMC : హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని…
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈనెల 9న చనిపోయారు. దీంతో... ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఇందుకు సంబంధించి శాసనసభ సెక్రటరీ గెజిట్ ఇచ్చారు కూడా. అటు కేంద్ర ఎన్నికల కమిషన్కు పూర్తి సమాచారం చేరింది.
Kothwalguda Eco Park: కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది.
Hyderabad: సికింద్రాబాద్ లోని మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.