HYDRA : హైద్రాబాద్ నగరంలో రెండు కాలనీల మధ్య సౌకర్యాన్ని హైడ్రా సంస్థ మరింత మెరుగుపరిచింది. హబ్సీగూడ ప్రాంతంలోని స్ట్రీట్ నంబర్ 6 వద్ద ఉన్న అడ్డుగోడను తొలగించడం ద్వారా నందనవనం, జయానగర్ కాలనీల మధ్య అనుసంధానం ఏర్పడింది. దీని వల్ల రెండింటికీ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గింది. Rare-earths: “అరుదైన భూమి” కోసం భారత్ ఆరాటం.. చైనాకు చెక్ పెట్టే ప్లాన్.. గతంలో నందనవనంలోని స్ట్రీట్ నంబర్ 4 నుంచి హబ్సీగూడ మెయిన్ రోడ్…
చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు. ప్రమాదకర రసాయనాలతో వాటిని తయారు చేసి నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు అని చెప్పి అమ్మేస్తున్నారు కొంత మంది దుండగులు. కనీసం చిన్న పిల్లలు తాగుతారన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి భరతం పట్టారు రాచకొండ పోలీసులు. ఇంకా చెప్పాలంటే పలు ప్రమాదకర రసాయనాలు మిక్స్ చేసి తయారు చేసిన పాలు ఇవి. వీటిని స్వచ్ఛమైన పాలు అని నమ్మించి జనానికి అమ్మేస్తున్నారు కొందరు…
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్లైన్లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
Drug Rocket: తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. ఈగల్ టీం నేతృత్వంలో అతిపెద్ద నెట్వర్క్ బట్టబయలు అయ్యింది. కొంపల్లి లోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. అంతేకాకుండా హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని కొన్ని ప్రముఖ పబ్ యజమానుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలైంది. Read Also:Jakkampudi Raja: జనసేనలో చేరికపై…
ATM Robbery: హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. జూలై 8 రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. Read Also:HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్…
మైనర్ బాలికపై కన్నేస్తే.. ఇక అంతే సంగతులు, ఏళ్ల తరబడి జైలులో జీవితం మగ్గిపోవాల్సిందే. తాజాగా మైనర్ రేప్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో చట్టం కింద అరెస్టయిన యువకునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికలను రక్షించేందుకు ఎన్ని చట్టాలు అమలు చేస్తున్నా.. అక్కడక్కడ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. చిన్నారులపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. మాయ మాటలు లేదా చాక్లెట్, బిస్కట్ లేదా డబ్బులు ఇస్తామనో.. లేక…
హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ఈరోజు తెల్లవారుజామున మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, జింఖానా క్లబ్లో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్‌గా సిటీ పోలీసులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం ఆరా తీస్తున్నారు. Also Read: Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా…
HYDRA : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Authority) కదంతొక్కింది. హైదర్ గూడ గ్రామం, సర్వే నంబర్ 16లోని 1000 గజాల పరిమాణంలో ఉన్న పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. నలందా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హైడ్రాకు అందిన ఫిర్యాదులో, హైదర్ గూడలోని పార్క్‌కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం…