ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు.
Also Read:Husband Suicide: ప్రియుడి మోజులో భార్య.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి భర్త ఆత్మహత్య..
మొయినబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్ లో పనిచేసే వారిగా గుర్తింపు. మృతులు మలోత్ చందు లాల్(29), గుగులోత్ జనార్దన్(50),కావలిబాలరాజు(40) గా గుర్తింపు. పెద్ద అంబర్ పేట వద్ద ఉన్న హోటల్ కు కారు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారులో తనిఖీ చేయగా మద్యం బాటిల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.