Election Commission: తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ. సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేయాలి.. మనందరం కలిసికట్టుగా ఈరోజు నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకు రావాలని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Allu Aravind : సినీ నిర్మాత అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నడూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోని అరవింద్ సడెన్ గా ఈడీ ముందు హాజరుకావడం సంచలనం రేపింది. ఆయన్ను మూడు గంటల పాలు అధికారులు ప్రశ్నించారు. ఓ బ్యాంక్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నించారు 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్…
డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్…
బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ.. రాష్ట్ర కార్యాలయంలో.. నేతల ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయారాయన. అటు నాయకత్వం కూడా.. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటించింది.
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు.