ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, ఈ రోజు ఉదయం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి కూడా కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,…
అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది. అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్త నుంచి ఆ ఇల్లాలు దూరంగా వెళ్లిపోయింది. కాని అలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. తమిళనాడులో శవమై కనిపించింది. అసలు ఆ భార్యభర్త మధ్య ఏం జరిగింది? జోగులాంబ గద్వాల్ జిల్లా కొండపల్లికి చెందిన మాధవితో వనపర్తి జిల్లా నాగల్ కడ్మూర్కి చెందిన కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో ఇరువురు…
ఆశాడ మాసం ప్రారంభం అయితే చాలు తెలంగాణలో బోనాల పండగ సందడి అంతా ఇంతా కాదు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక హైదరాబాద్ లో ఉజ్జయిని, గోల్కోండ, లష్కర్ బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజుల పాటు వైన్ షాపులు మూతపడనన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6…
కూర్చుని తింటే.. రాళ్లయినా కరిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఆస్తులు ఎంత? అనుకున్నాడో ఏమో.. భారీగా ఆస్తులు కూడబెట్టాలని, డబ్బులు సంపాదించాలని రంగంలోకి దిగాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. డబ్బు సంపాదన కోసం అతడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? హవ్ ఏ లుక్. ఇతని పేరు.. రమేష్ గౌడ్. చేసేది వడ్డీ వ్యాపారం.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 4 భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా అద్దె కూడా లక్షల్లో…
హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి…
HYDRA : హైదరాబాద్లో వర్షాకాలంలో వరదలు ముంచెత్తకుండా నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. కూకట్పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్లో హైడ్రా అధికారులు తొలుత బుల్కాపూర్ నాలా, ఐడీఎల్ నాలాల ఆక్రమణలను తొలగించే పనులను చేపట్టారు. బుల్కాపూర్ చెరువు నుంచి ప్రారంభమై, హైటెక్ సిటీ ప్రాంతాల గుండా హుస్సేన్ సాగర్లో కలిసే ఈ నాలా, గత కొన్నేళ్లుగా అనేక చోట్ల ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా తుమ్మలబస్తీ.. ఆనందనగర్ మధ్య…
హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు.. మన దేశం వివిధ సంస్కృతులు ఉంటాయి.. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు.. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారు.. మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి..? అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు.. జర్మనీ, ఇతర భాషలు నేర్చుకుంటున్నాం.. కానీ, హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు..
Telangana High Court: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను విడుదల చేసింది.
HYDRA: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్లోని హబీబ్ నగర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై దాడి చేశారు. నాలా పైన నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా.. హబీబ్ నగర్ ప్రాంతంలో ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. స్థానికంగా 7 మీటర్ల విస్తీర్ణంలో నాలా ఉందని గుర్తించిన అధికారులు, వాటిపై జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు…
కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు. ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు…