ఈజీమనికి అలవాటుపడి.. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదార్లు తొక్కుతున్నారు కొందరు వ్యక్తులు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదేరీతిలో ఓ ముఠా నకిలీ కాల్ సెంటర్ ఏర్పర్చుకుని విదేశీయులే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో కాల్ సెంటర్ పై దాడి చేశారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. బాచుపల్లి ఎస్ఆర్ఆర్ ప్రైడ్ లోని విల్లా 29 లో కాల్ సెంటర్ నడుపుతున్నట్లు గుర్తించారు.
Also Read:Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం.. రూ.10 కోట్ల మేర లూటీ
ముఠా సభ్యులంతా కోల్ కతా కి చెందిన వాళ్లుగా గుర్తించారు. జైపర్, ఎక్స్ లైట్, మైక్రోసాఫ్ట్ ద్వారా కస్టమర్ కేర్ పేరుతో భారత్ తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారికి మెయిల్స్ పంపుతున్నట్లు తెలిపారు. మెయిల్స్ కి స్పందినవారిని ట్రాప్ చేసి.. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులు కొల్లగొడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 8 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లు తెలిపారు. 10 ల్యాప్ టాప్స్, 9 మొబైల్స్ స్వాధీనం చేసుకుని, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 3.15 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.