మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మలక్ పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన చందునాయక్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సౌత్ ఈస్ట్ డిసిపి సాయి చైతన్య వెల్లడించారు. సాయి చైతన్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం 7:30 గంటలకు కాల్పుల ఘటన జరిగింది.. చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు…
హైదరాబాద్ మలక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్…
మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట వాసి. కాల్పులకు కారణం భూ వివాదం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వాకర్స్ పై కాల్పులు జరపడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన…
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ…
హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ వార్డ్ బాయ్ మహిళా పేషెంట్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వార్డ్ బాయ్. అసభ్య ప్రవర్తనతో మహిళ పేషంట్ కేకలు వేసింది. మహిళా పేషంట్ అరుపులతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు…
పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు.…
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, మాజీ బీజేపీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన శ్రీ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహం ఫిల్మ్‌నగర్ నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ…
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13 తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది…