తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా వెంట పెద్ద దర్శకులు లేరు” అని ఆయన అన్నారు.
Also Read : Kajal Agarwal : జిమ్ లో చెమటలు చిందిస్తున్న కాజల్..
“నాకు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు, కానీ దానివల్ల డబ్బులు రావు. డబ్బులు రావాలంటే సినిమా చేయాలి. కింద నుంచి వచ్చిన వాళ్లం నా వెంట పెద్ద దర్శకులు లేరు” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా, “ఓ జీ ఓ జీ” అంటూ ఓ జీ నామస్మరణ చేయడం మొదలుపెట్టారు అభిమానులు. దీంతో కల్పించుకున్న పవన్ కళ్యాణ్, “ఓజీ వస్తుంది, ఇది వీర” అని అనడంతో మళ్లీ వీర నామస్మరణ మొదలుపెట్టారు. “నన్ను అందరూ కూడా వీడితో ఈ రీమేక్ చేస్తే పని అయిపోతుంది, డబ్బులు వస్తాయి, వీడితో రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి అని అనుకునేవాళ్లు.
Also Read : AM Ratnam: పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు!
ఎప్పుడూ రీమేక్ తీస్తామని తిడతారు, మరి తీయకపోతే నా పార్టీని ఎవరు నడుపుతారు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్లిపోతారు. నా భార్యని, పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి. వాళ్లకి డబ్బులు కావాలి, పార్టీని నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు ఈజీ దారి అయింది. నేను కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజం పిచ్చి, సినిమా మీద ఉన్న పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే, అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. నాతో బలమైన సినిమా చేయాలని కోరుకున్నాడు. క్రిష్ గారి వల్లే ఈ సినిమా వచ్చింది.”