Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. అంబర్‌పేట్‌కు చెందిన గోపి కుమార్ (35) అనే వ్యక్తి, భార్య పుట్టింటికి వెళ్లిందనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. గోపి కుమార్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై భార్యతో వాగ్వాదం కూడా జరిగినట్టు సమాచారం.
Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..!
అయితే, ఎలాగైనా తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతో గోపి కుమార్ హయత్ నగర్ లోని తన భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అక్కడ గోపి కుమార్‌కి భార్య కుటుంబ సభ్యులతో కొద్దిమేర ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. భార్య తిరిగి రావడానికి అంగీకరించకపోవడంతో గోపికి తీవ్ర మనోవేదన మిగిల్చింది. ఈ సంఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన గోపి కుమార్ అంబర్ పేట్ లోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణ పరిణామాలకు దారితీస్తున్న తీరుపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Horoscope Today: శనివారం దినఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
ఇక ఈ ఘటనపై అంబర్‌పేట్ పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపి కుమార్ తీసుకున్న తీవ్ర నిర్ణయానికి కారణాలపై కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.