హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అని పేర్కొన్న ఆయన, పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను అంటూ ఒక పోడియం సెట్ చేసుకున్నారు.
Also Read:Perni Nani: పేర్ని నానికి హైకోర్టులో ఊరట..
సినిమా ప్రమోషన్స్ లాంటివి నాకు అలవాటు లేదు. పొద్దున క్యాబినెట్‌లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడాను. నేను డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను. కేవలం అది పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరీ రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, నా జీవితంలో ఇలాంటి విషయాలు ఉంటాయని తెలియదు.
Also Read:HHVM Song: హరిహర వీరమల్లు పవర్‌ఫుల్ పాట లిరికల్ వచ్చేసిందోచ్…
నా జీవితంలో ఏదీ వడ్డించి ఇస్తారు కాదు, అన్నీ కింద పడి, మీద పడి, నలిగి, చివరికి సాధిస్తాను. డిప్యూటీ సీఎం అయ్యాను. ఇలా చిటికేస్తే సినిమా రిలీజ్ అవుతుందా అంటే కాదు. సినిమా రిలీజ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాలి, ఎన్ని పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేసినప్పుడు నాకు ఒకసారి అలసట వచ్చేస్తుంది. నాకు వారం రెండు రోజులుగా నిద్ర లేదు. నా సినీ జీవితంలో గత రెండు రోజుల క్రితం మాట్లాడిన దాంట్లో 10% కూడా మాట్లాడి ఉండను. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఒంటరిగా బతకాలనుకున్న వాడిని, అనుకోకుండా పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చాను.