సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చూస్తూ వచ్చాం.. ఆర్టీసీకి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. పండుగలను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా.. అదనంగా బాదేస్తూనే ఉన్నారు.. అయితే, సంక్రాంతి సమయంలో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ.. ఇప్పటికే ఆన్లైన్లో సంక్రాంత్రికి బుకింగ్స్ ప్రారంభించింది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.. www.apsrtconline.in…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ మోసం. రూ.లక్షకు లక్ష ఇస్తామంటూ 4000 వేల కోట్లలో వసూళ్లు.... చివరకు దుఖాణం ఎత్తేసిన మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ. తక్కువ టైమ్లో ఎక్కువ ఆదాయం చూపిస్తాం. ట్రేడింగ్లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటూ అమాయకులకు టోపి పెట్టింది.
కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. కాంగ్రెస్ సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ నేత మల్లు రవి.. ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ…
హైదరాబాద్లోని చందానగర్లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.
చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం…
జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే…
హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యానిటీలతో సహా నగర ఈవెంట్ నిర్వాహకులు ఉదయం 1గంట వరకు మాత్రమే కొత్త సంవత్సరం పార్టీలను ప్లాన్ చేయడానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు.
CNG Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంలో పలువురు సీఎన్జీ వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్జీ ధరను మరోమారు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం కారణంగా సీఎన్జీ ధరలను పెంచినట్టు వివరించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ.79.56కి చేరింది. Read Also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు..…