హైదరాబాద్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన వచ్చే నెల జనవరి 1 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి వరుసగా శుభవార్తలు చెబుతూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. కొన్ని టెస్ట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న వేళ.. మరో 207 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది… వెటర్నరీ డిపార్ట్మెంట్లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులతో పాటు..…
టాలీవుడ్లో మరోసారి విషాదం నెలకొంది.. సూపర్ స్టార్ కృష్ణ ఘటన నుంచి ఇంకా తేరుకకముందే.. మరో సినీ దిగ్గజం భువినుండి దివికి ఎగిసింది.. సీనియర్ నటుడు.. కైకాల సత్యనారాయణ ఇవాళ ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.. సినీ నటుడిగానే కాదు.. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు.. తన 60 సంవత్సరాల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు.. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు పోషించారు.. హాస్య, ప్రతినాయక, నాయక,…
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్లో ఆయన పలువురు నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు.
బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ సైట్ 2 లో భారీ చోరి సంచలనంగామారింది. ఫిలిం నగర్ లో శమంతక డైమండ్స్ షాపును నిర్వహిస్తున్న పవన్ కుమార్, గుజరాత్,సూరత్ బంగారం ముడి సరుకు తెచ్చి ఆర్డర్ పై ఆభరణాలు చేయించి యజమాని ఇస్తుంటాడు.
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లా మంత్రులు ఒక్కటై తిరుగుబాటు చేయడం బీఆర్ఎస్లో కలకలం రేపింది. ముందెన్నడూ లేనివిధంగా బహిరంగంగా ఓ మంత్రిపై జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడటం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మార్కెట్ కమిటీ నియామకం వివాదంలో.. మంత్రి మల్లారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఆ రహస్య సమావేశానికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే శంకుస్థాపనకు వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అవమానం జరగడం.. పార్టీలో తీవ్ర చర్చగా మారింది.…
ప్రేమకు కులం, మతం, రంగు, రూపమే కాదు.. దూరం కూడా భారం కాదు.. ఇప్పటికే ఎంతోమంది ప్రేమికులు సప్తసముద్రాలు దాడి ఏడు అడుగులు వేసినవారు ఉన్నారు.. ఖండాంతరాలు దాటి ఒక్కటైన వారు ఉన్నారు.. తాజాగా.. ఓ జంట ఈ కోవలో చేరింది.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన అబ్బాయిని.. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన అమ్మాయి పెళ్లి చేసుకుంది.. 26 సవత్సరాల పరిచయం ప్రేమగా మారి ఒక్కటైన సంబరానికి హైదరాబాద్ శివారు ప్రాంతం వేదికైంది.. ప్రాంతాలు వేరైనా ఒకరి సంస్కృతి…
Government Land Auction:ఆదాయం సమకూర్చునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేసి ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్లాట్లను వేలం వేయాలని HMDA నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ, గండిపేటలోని 366 సర్వే నెంబర్లో ఉన్న 41 వేల 971 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు విక్రయానికి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1972 డిసెంబరు 21న వైఎస్ రాజశేఖర్రెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఓవైపు వ్యాపారం చేస్తూనే.. రాజకీయాల్లోనూ రాణించారు.. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో…