Income Tax Raids: హైదారబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఊర్జిత, ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు.
Read also: Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు
నిన్న ఉదయం నుంచి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య, సీఎస్‌కే, ఉర్జిత, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్లాట్ల వివరాల్లో అక్రమాలున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆదిత్య రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాలతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పాత్రలు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్స్, అకౌంట్స్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీలు చేపట్టిన వెంచర్స్, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వివరాలు అరా తీస్తున్నారు. ఐటీ సిబ్బంది విచారణకు అకౌంట్ సిబ్బంది సహకరించపోవడం.. కొన్ని కార్యాలయాలలో దాడులకు వచ్చినప్పుడు అకౌంట్స్ సిబ్బంది కనిపించక పోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. మరికొన్ని కార్యాలయాల్లో అకౌంట్ సిబ్బందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. సోదాలు ముగిసే వరకు ఇళ్లకు పంపించమని చెప్పినా ఐటీ అధికారులు. అకౌంట్స్ సిబ్బంది నుండి బ్యాంక్ ట్రాన్స్‌యాక్షన్స్ వివరాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read also: Kanti Velugu: నేడు కంటి వెలుగు రెండో విడత.. ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ తప్పనిసరి
కాగా.. నిన్న ఉదయం నుండి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఆదిత్య, సీఎస్ కే, ఊర్జిత, ఐరా రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు చేశారు. పలు ప్లాట్ల వివరాలపై అవకతవకలున్నాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆదిత్య రియల్ ఏస్టేట్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి సుమారు 50 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ , విశాఖపట్టణం, బెంగుళూరు పట్టణాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. పలు రియల్ ఏస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయపన్నుకు సంబంధించి అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు.. ఆయా రియల్ ఏస్టేట్ సంస్థలు విక్రయించిన ప్లాట్ల విక్రయాల గురించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
Tension in Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్ లైన్