Hyderabad: సంధ్య 70ఎంఎం థియేటర్ @ 44 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరం అంటే సినిమాలకు పెట్టింది పేరు. అందులోనూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమా విడుదలైందంటే అక్కడ ఉండే హడావిడి వేరు. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చాలా థియేటర్లు ఉండేవి. కానీ మల్లీప్లెక్సుల రాకతో థియేటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఐదు థియేటర్లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అందులో సుదర్శన్ 35ఎంఎం, దేవి 70ఎంఎం, సంధ్య 70ఎంఎం, సంధ్య 35 ఎంఎం, సప్తగిరి 70ఎంఎం థియేటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే సంధ్య 70ఎంఎం థియేటర్ ఏర్పాటు చేసి 44 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సంధ్య థియేటర్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అనంతర కాలంలో సంధ్య 35ఎంఎం థియేటర్ నిర్మాణం కూడా జరిగింది.
Read Also: Vijay Zol: అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్
Also Read
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 1979, జనవరి 18న సంధ్య 70ఎంఎం థియేటర్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి ఉమ్మడి ఏపీ మంత్రి జి.వెంకటస్వామి ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ థియేటర్‌లో ప్రారంభోత్సవ చిత్రంగా హిందీ మూవీ షాలిమార్‌ను ప్రదర్శించారు. అప్పట్లో ఏసీ థియేటర్‌గా మాత్రమే ఈ హాలు ఉండేది. ఇటీవల కోవిడ్ సమయంలో ఈ థియేటర్‌ను ఆధునీకరించి 4కే ప్రొజెక్షన్, డాల్మీ ఎట్మాస్ సౌండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ఈ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గతంలో ఉన్న సుదర్శన్ 70ఎంఎం, ఓడియన్ 70 ఎంఎం, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్, శ్రీమయూరి, ఉషా మయూరి లాంటి థియేటర్లు ఇప్పుడు కనుమరుగు అయ్యాయి. వీటి స్థానంలో షాపింగ్ మాల్స్ నిర్మాణం జరుగుతోంది.
Sandhya 70MM Theater, Hyderabad (RTC “X” Roads) Opened On 18-01-1979 !!
First Movie Screened On 19-01-1979 #Shalimar (Hindi) !!#44YearsForSandhya70MM pic.twitter.com/8a76ijWLK0
— Only Movies News (@onlymoviesnews) January 18, 2023
తాజావార్తలు
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?