Rakul Preet Singh: డ్రగ్స్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది.
తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఖండించారు.
ISB @20 Years: నేడు దక్షిణ భారత దేశానికే హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ తలమానికంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) ప్రస్తుతం ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి.…
కాలం మారుతోంది.. కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్…
హైదరాబాద్‌లో పేలుడు కలకలం.. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి డంపింగ్ యార్డులో తండ్రి చంద్రన్న(45), సురేశ్(14) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. యథావిధిగా గురువారం చెత్త ఏరుతుండగా.. పెయింట్…
హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Rangareddy District beat Bengaluru Urban District in terms of Per Capita Income (PCI): తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ సత్తా చాటింది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల తలసరి ఆదాయాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం సగటు కన్నా ఎక్కువగా ఉంది. పలు సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం జీవనోపాధి కోసం వచ్చే వారిని తెలంగాణ అక్కున…
Mclaren 765 LT: గత ఐదేళ్లలో భారతీయ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. లంబోర్ఘిని, ఆస్టన్, ఫెరారీ వంటి బ్రాండ్లు తమ కార్లను మన దేశంలో విక్రయాలు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మెక్లారెన్ ప్రవేశించింది. ఈ బ్రాండ్ ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల ముంబైలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఈ బ్రాండ్ తన ఫ్లాగ్షిప్ సూపర్‌కార్ మెక్లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో…
దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్‌లో పట్టేవారికే బీఆర్ఎస్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు…