Hyderabad police-give-41a-crpc-notice-to-goshamahal-mla-raja-singh-on-ajmer-dargah-comments: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదుచేశారు. ఈ కేసును కంచన్‌బాగ్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో మంగళ్‌హాట్ పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు.
అయితే నోటీసులపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిచారు. నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్‌స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండంటూ ఘాటుగా స్పందించారు. ఈ రోజు తెలంగాణా పోలీస్ డిపార్ట్‌మెంట్ సిగ్గుపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 నెలల తర్వాత తెలంగాణా పోలీసుల నుండి నాకు నోటీసు వచ్చిందని, నాపై పీడీ యాక్ట్ ని ప్రయోగించారంటూ వ్యాఖ్యానించారు. అప్పుడు మేము ఆందోళన చెందలేదు.. భయపడలేదు ఈ నోటీసు నన్ను భయపెడుతుందా? అంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ మాటలు చర్చకు దారితీస్తున్నాయి.
Read also: scrap: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు ఇక తుక్కే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టులో కేసు నమోదైన విషయం తెలసిందే.. అయితే, ఈ అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు రాజాసింగ్‌కు 41ఎ సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేశారు. కాగా.. అంతకు ముందు మహ్మద్ ప్రవక్త వివాదాస్పద వ్యాఖ్యలు.. పలు కేసుల నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రాజాసింగ్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
Read also: scrap: 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు ఇక తుక్కే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని రాజాసింగ్ పోరాటం చేశారు. మునావర్ హిందువుల్ని కించ పరిచారని ఆరోపించారు. రాష్ట్రం మాత్రం మునావర్ షో కు అనుమతి ఇచ్చింది. దీంతో షో యధావిధిగా నడిచింది. దానికి కౌంటర్‌గా రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. దీంతో ఆవీడియో తీవ్ర వివాదాస్పదమయింది. రాజాసింగ్ పై పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కాగా.. కోర్టు రిమాండ్‌కు పంపకుండానే బెయిల్ ఇచ్చింది. ఆ..తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు…గత ఏడాది ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి రాజాసింగ్ ను జైలు తరలించారు.
Read also: Ramgopalpet Fire Accident: అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..
అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి పీడీ యాక్ట్‌పై తన భర్తను అక్రమంగా జైల్లో నిర్బంధించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో..ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై పీడీ యాక్ట్‌ను క్వాష్ చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది..పలు రకాల షరతులను విధించింది..మీడియాతో మాట్లాడటం ర్యాలీల్లో పాల్గొనడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది. బైల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదల అయ్యారు. మళ్లీ రాజాసింగ్ పై మంగళ్ హాట్ పోలీసుల నోటీసులు పంపడంతో అసలు ఏం జరుగుతోండి అన్నట్లు రాజకీయ దుమారం రేపుతుంది. రాజాసింగ్ ని మళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తారా? పోలీసుల నోటీసులకు రాజాసింగ్ వివరణ ఇస్తారా? అనేది ఉత్కంఠంగా మారింది.
Senior Naresh: అలరిస్తోన్న నరేశ్ నవ్వులాట!