Barkat Ali khan Funeral: నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barkat Ali khan Funeral: టర్కీలోని ఇస్తాంబుల్ లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ ముకరం ఝా బహదూర్ గత శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఎనిమిదో నిజాం భౌతిక కాయాన్ని ఆయన తండ్రి అజమ్ ఘా సమాధి పక్కనే ఖననం చేయనున్నారు. ముకరం ఝా బౌతిక కాయాన్ని ఇస్తాంబుల్ నుంచి నిన్న సాయంత్రానికి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలకు ఆయన భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మక్కా మసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు చేస్తారు. కాగా.. మక్కా మసీదులోనే దక్షిణ భాగంలో అజమ్ ఝా సహా అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి..అక్కడే ముకరం ఝా భౌతిక కాయాన్ని కూడా ఖననం చేయనున్నారు.
Read also:
Also Read

హైదరాబాద్ ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్‌కు ఆజం ఝా, మౌజంఝా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో 7వ నిజాం తన మొదటి కొడుకు కుమారుడైన ముకరం ఝాను 8వ నిజాంగా ప్రకటించాడు. 1971లో భారత ప్రభుత్వం కిరీటాలను రద్దు చేసే వరకు ముకరం ఝా అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా పిలిచేవారు. ఇక ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ కు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ముకరం ఝా తండ్రి ఆజాం ఝా, తల్లి దుర్రె షెహవార్.
ఇస్తాంబుల్‌లో అద్దె ఇంట్లో మరణం:
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ సమయంలో గొప్ప సంపదతో ప్రపంచ పాలకుడు. అతని మనవడు, ఎనిమిదవ నిజామాన్ ముకరం ఝా, చిన్న వయస్సులోనే ప్రపంచ పరిపాలకుడయ్యాడు. అదే సమయంలో వారసత్వ ఆస్తితో దివాళా తీసి విలాసాలు, డాబు దర్పాలకు దిగినట్లు చెబుతున్నారు. నలుగురు భార్యలతో విభేదాల కారణంగా పలు కేసులు, ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడ్డాడని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అతని పిల్లలు, బంధువులు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ఆస్తుల విక్రయాలపై కోర్టు ఆంక్షలు విధించింది. అలా ఎనిమిదో నిజాంకు దాదాపు చేతిలో డబ్బులు కూడా లేని స్థితి ఎదురైందని చెబుతారు. ఆస్ట్రేలియాకు చెందిన రచయిత, పరిశోధకుడు రీసెర్చర్ జాన్ జుబర్‌జి మాట్లాడుతూ.. వారు ఇస్తాంబుల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేవారని పేర్కొన్నారు. ఆయన The Last Nizam అనే పుస్తకాన్ని రాశారు. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ (The Raise and Fall of India’s Greatest Princely State) గురించి ఉన్న ఈ పుస్తకంలో ఎనిమిదో నిజాం అద్దె ఇంటికే పరిమితమైనట్లుగా రాశారు.
Read also: CM KCR : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. మరో ముగ్గురు సీఎంలు
చౌమహల్లా ప్యాలెస్‌లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. చివరి నిజాం మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం చేసిన సామాజిక సేవలకు గుర్తుగా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈనేపథ్యంలో చివరి నిజాం అంత్యక్రియలు ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!