Today Business Headlines 20-04-23: ‘‘భాగ్య’’మంతుల నగరం: ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్‌కి చోటు లభించింది. 97 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కి 65వ స్థానం దక్కింది. నగరంలో ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 11 వేల ఒక వంద అని ఈ లిస్టును తయారుచేసిన హెన్లే అండ్ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో రోబో సాయంతో మొదటిసారిగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ మేరకు కేర్ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్కో కొత్త యూనిట్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందన్నారు.
హైదరాబాద్‌లో దాదాపు అన్ని ఫ్లై ఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పిఎన్విఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు మంగళవారం రాత్రి నుండి మూసివేయబడతాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా మరో మ్యాచ్ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఢీకొనబోతోంది.. ఈ సీజన్లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కిందినుంచి వరుసగా రెండు, మూడో స్థానాలకే పరిమితం అయ్యాయి.. అయితే, హైదరాబాద్‌లోని…
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిన్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. మరోసారి ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాయలంలో వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.. అయితే, ఈ లోగా హైకోర్టును ఆశ్రయించారు అవినాష్‌రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు…
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.. ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ కు అనుమతించాలని అవినాష్‌రెడ్డి లాయర్ అభ్యర్థించారు.. అయితే, హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం పేర్కొంది.. మధ్యాహ్నం 2.30 గంటలకు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో తాజాగా, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.. అంతా అతని సైగల్లోనే, కనుసన్నల్లోనే జరిగాయంటూ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో…