AP Crime: ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న రాధ.. ఇటీవలే తన సొంత గ్రామానికి వెళ్లింది.. అయితే, నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది.. దీంతో.. తెలిసినవారి ఇల్లు, బంధువుల ఇళ్లలో వెతికిన కుటుంబసభ్యులు.. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురు కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు.. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్ లొకేష్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద ఉన్నట్టు గుర్తించారు.. అక్కడికి వెళ్లి చూస్తే.. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.. అయితే, రాధ జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్దకు ఎలా వెళ్లింది.. ఎవరైనా పిలించారా? లేదా తానే వేరే ఏదైనా పనిపై వెళ్లిందా..? కిడ్నాప్ ఏమైనా చేశారు? అసలు హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Heat Wave Alert: ఎండ తీవ్రత, వడగాల్పులు.. అత్యవసరం అయితేనే బయకు రండి..!