Alliant Group: నగరానికి అలియంట్ గ్రూప్ సంస్థ.. 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించనుంది. దాదాపు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హ్యూస్టన్‌లో కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. అమెరికాకు చెందిన అలయంట్ గ్రూప్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో అలయెంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హ్యూస్టన్‌లో ఆ కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌస్‌గా పేరొందిన అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని బలోపేతం చేస్తుందని మంత్రి వెల్లడించారు.
What a lovely welcome at Alliant Headquarters today at Houston!!
Also Read
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
Many thanks @Dhavaljadav02 for the grand reception and hospitality 🙏 pic.twitter.com/H8OAhJEfXo
— KTR (@KTRBRS) May 20, 2023
హైదరాబాద్ కేంద్రంగా కొత్తగా 9 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీ యువతకు ఇదో గొప్ప అవకాశంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. హైదరాబాద్ నగరం బీఎఫ్‌ఎస్‌ఐ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారుతోందని, అలయంట్ తీసుకున్న నిర్ణయం నగరంపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తోందని మంత్రి తన ట్వీట్‌లో వెల్లడించారు. హ్యూస్టన్‌లోని అలయంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. మంత్రి కేటీఆర్‌కు ఆ సంస్థ ఉద్యోగులు స్వాగతం పలికారు. పూల మాలలు వేసి ఆహ్వానం పలికారు.
Extramarital Affair: భర్త వేధింపులు.. ప్రియుడి వద్ద భార్య గోడు.. కట్ చేస్తే దారుణం
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!