International Storytelling Festival: కథలు చెప్పడం ఒక కళ. మన మైండ్ లో ఉన్న ఒక కథను.. ఎదుటివారికి కళ్లకు కట్టినట్లు చెప్పే ట్యాలెంట్ చాలా తక్కువమందికి ఉంటుంది. ఇక ఆ ట్యాలెంట్ ఉన్నా కూడా నలుగురు ఏమనుకుంటారని కొందరు..
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది.. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో పులివెందులకు చెందిన కీలక వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు.. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన మృతదేహానికి కుట్లు వేసి, కట్లు గట్టిన…
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.
Pawan Kalyan: తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ జనసేన నేతలకు.. కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం చేశారు.. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన పవన్… మరి కొన్ని నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు జరపనున్నట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గాల నేతల భేటీలో తెలంగాణ జనసేన ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో క్షేత్ర…
అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా న్యూ లుక్ లో కనిపించేలా కసరత్తులు చేస్తోంది. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్ లో ఇవాళ సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు.
ఈ కాలంలో మనిషి చంద్రుడిపై కాలు మోపడమే కాకుండా అక్కడే ఉండేందుకు సిద్ధమవుతున్నాడని కొందరు ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఆ మూఢనమ్మకాలపై నమ్మకంతో జంతుబలులు, నరబలులు చేస్తారు. తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
మీరు హైదరాబాద్లో నివసిస్తూ ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఈసారి హైదరాబాద్ నుండి గ్రహణం కనిపిస్తుందా ? అని నగర వాసులు ఆత్రుతతో ఉన్నారు.