ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుధాకర్ రెడ్డి.. సెల్ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద రాధ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. రాధను కారుతో ఢీకొట్టి, రాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.. రాధ హత్య కేసులో ఆమె స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. ఆర్థిక వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితునితో రాధకు విభేదాలు ఉన్నట్టు చెబుతున్నారు. రాధ స్నేహితుడు కాశిరెడ్డి మరికొందరితో కలసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు.. కాశిరెడ్డి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. రాధ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలో రిపోర్ట్ వస్తే మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.. ఇక, రాధను కారుతో తొక్కించటం కంటే ముందు.. దుండగులు ఆమెను కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు, వారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు ఘటనా స్థలంలో పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. రాధ శరీరమంతా ఉన్న గాయాల ఆనవాళ్లను పరిశీలిస్తే నలుగురైదుగురు వ్యక్తులు దారుణంగా చంపినట్లుగా భావిస్తున్నారు.. వెలిగండ్ల మండలం గుండ్లోపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ.50 లక్షల అప్పు ఇచ్చారని, అతనే తన అనుచరులతో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారంటూ రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు..