Bhopal HUT Case: బిర్యానీ, లడ్డు పదాలు కోడ్ లాంగ్వేజ్.. సంభాషణకు టెలిగ్రామ్, వాట్సాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhopal HUT Case: భూపాల్ హట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్ లుగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపినట్లు తెలిపారు. నిందితులు జూమ్ యాప్ లోను సమావేశాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. భూపాల్ కమల్ పార్టీ స్టేషన్ , మోతిలాల్ నెహ్రూ స్టేడియం వద్ద రెక్కీ నిందితులు నిర్వహించినట్లు గుర్తించారు. జీహాదీ సాహిత్యం, టెక్నికల్ పరికరాలు, స్వాధీనం చేసుకున్నారు. ఎంతమంది యువత హట్ లో జాయిన్ అయ్యారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. బీజేపీ అగ్ర నేతలను టార్గెట్‌గా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో నిర్ఘాంతపోయారు.
నిందితులు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి పేల్చేందుకు సిద్ధం చేసుకున్నట్లు కనుగొన్నారు. ఎన్నికల ముందు విధ్వంసం సృష్టించేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నిందితులపై రెండు సంవత్సరాలుగా యాంటీ టెర్రస్కార్డ్ పోలీసులు నిఘా పెట్టారని వెల్లడించారు. పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నిందితులను అరెస్ట్ చేసిన ఎటిఎస్ అధికారులు తెలిపారు. నిందితులు విదేశాల నుండి వస్తున్న వాయిస్ మెసేజ్లను ఆధారంగా చేసుకొని ప్లాన్ అమలు చేయాలనుకున్నారని వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి డిజిటల్ ఎవిడెన్స్ దొరకకుండా పక్కా ప్లాన్‌తో నిందితులు జాగ్రత్తపడ్డట్టుగా గుర్తించారు. పోలీసులకు పట్టుబడతామని యాసిర్ ముందే గ్రహించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
Read also: Rashmika: ఇంత పాజిటివ్ పర్సన్ ని ట్రోల్ చేస్తున్నారే…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన యాసిర్ ఆదేశాల మేరకు సలీం హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు 18 నెలలుగా హైదరాబాద్ పాతబస్తీలో నివసిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కొంతకాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందం హైదరాబాద్ వచ్చింది. నగరంలో హిజ్భ్ ఉత్ తహ్రీక్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఉగ్రవాద గ్రూపులు తమ ప్లాన్‌ను మూడు దశల్లో అమలు చేయాలని ప్లాన్ చేశాయి. ఇందుకోసం యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు 3600 మంది సభ్యులు ఉన్నారు.
వీరంతా ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు దాడులు చేసేందుకు అనంతగిరి అడవుల్లో శిక్షణ పొందినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు పేలుడు పదార్థాల తయారీ, తుపాకులు కాల్చడంలో శిక్షణ పొందినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మాల్స్, ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే ప్రాంతాలపై దాడి చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అంతేకాదు, నిందితులు కనీసం రెండు రోజుల పాటు తినకుండా, తాగకుండా ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించారు. నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్‌సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మరో ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు.
Allu Arjun: స్టైలిష్ స్టార్ జాతకంలో దోషం !.. త్వరలో ఊహించని పరిణామాలు ?
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..