Minister Harishrao: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. జూన్ నాటికి పట్టణాల్లో 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈడెన్ గార్డెన్స్లో ఎదురైన పరాజయానికి ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్ 5 పరుగుల తేడాతో ఎస్ ఆర్ హెచ్ పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
Zero Shadow day: ఈ నెల 9న హైదరాబాద్లో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నం 12:12 గంటలకు 'జీరో షాడో డే' అనే ఛాయ ఉండదు. ఈ విషయాన్ని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.హరిబాబుశర్మ తెలిపారు.
Nehru Zoo Park: తెలంగాణ ప్రభుత్వం పర్యాటకులకు షాక్ ఇవ్వనుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నెహ్రూ జూ పార్క్ టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
TV Channel: హైదరాబాద్లోని ఓ తెలుగు టీవీ ఛానల్ అర్థరాత్రి అశ్లీల వీడియోలను ప్రసారం కవడం కలకలం రేపింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా అసభ్యకర సన్నివేశాలు ప్రసారం కావడం సంచలనంగా మారింది.
LPG Cylinder Price: ఈ నెలలో చమురు కంపెనీలు గ్యాస్ ధరలను మరోసారి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం.. మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది
రోహిత్ శర్మ పుట్టిన రోజును హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్ ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు.